Friday, 12 November 2021

Few interesting delicacies and tastes from childhood

 


కూరంతా అయిపోయిన తరువాత దాక అడుగున ఉన్న పులుసు లేక ఇగురు తోనో  కలిపి తిన్న అన్నం


గేదెపాల తొరకలు (మీగడ) మరగబెట్టి నెయ్యంతా వడపోసెయ్యగా అడుగున మిగిలిన మడ్డి ముక్కలతో బెల్లం కలిపి తినేది   


బెల్లం పాకంతో నంజుకొని తిన్న దిబ్బరొట్లు   


దాక అడుగున మాడిన ఉప్మా గోకిడి 


పుట్టినరోజు నాడు బళ్ళో పంచిపెట్టే పప్పుబెల్లాలు


గుళ్ళో పొద్దున్నమాటు ఇచ్చే ప్రసాదాలు, పానకాలు


సారె పంచిపెట్టినప్పుడు అందులో వచ్చే పల్చ పల్చగా తెల్లగా ఉండే చలివిడి


వొటేలు ఇడ్లి, వొటేలు పూరి, వొటేలు పూరికూర  

 పెళ్ళిభోజనాల్లో  ఆఖర్న పంచిపెట్టే కిల్లీ, తీర్తాల్లో  దొరికే ఖర్జూరం 


చుట్టాలు ఎవరన్నా మన ఇంటికి వచ్చినపుడు తెచ్చే ద్రాక్షపళ్ళు, యాపిలీసు కాయలు