Tuesday, 29 June 2021

aakumadi


 ఏపుగ వరి నారు

పిల్లగాలి తెగ హుషారు

లోలోపల సంబరం పొలమారు

ఇది తొలకరి తరుణ జోరుపైరు

భూముల పచ్చదనాలు అలరారు

palakarimpu

 ఒక పలకరింపు మువ్వల సవ్వడి

ఒక పలకరింపు చినుకుల జల్లు

ఒక పలకరింపు ఒక ఆత్మీయ బంధం

ఒక పలకరింపు గుండెధైర్యం

మనం ఒంటరి కాదనే మనోనిబ్బరం

చల్లని ఎండలా, వెచ్చని చలిలా

మనసు తేలికగ, ప్రాణం హాయిగ

ప్రపంచమే మన వెనకున్నట్లుగా

ఓ పలకరింపు ఓ చిలకరింపు

ఓ పలకరింపు ఓ తొలకరింపు

Friday, 12 June 2020

కళ్ళకు జోడు పెట్టి
కాళ్ళకు మేజోడు కట్టిపెట్టి
సులువుకు కచ్చా కట్టి
సైకిలుకు జిన్నుగడ్డి ఇరగ్గట్టి

సాగిపోయే  అవ్వా

నీ కాయకష్టానికి జోహర్
నీ తెగువకినిబ్బరానికి  జోహార్
నీ స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి జోహార్
నీ తీరుకు నీపోరుకు జోహార్

నీ చేను పచ్చగుండ
నీ కంటిచూపు చక్కగుండ
నీ కడుపు చల్లగుండ
నీ ఆయువు మంచిగుండ

చివరగా చిన్న విషయం అవ్వో!!
 రైలు పట్టలు మీద కాక
వేరే దారి చూసుకో అవ్వోయ్

Spring

తియ్యటి పుల్లటి మామిళ్ళు
అవకాయ మాగాయ పచ్చళ్ళు
పచ్చని ఆకుల్లో రంగుల పూవుల్లు
వెచ్చటి కొమ్మల్లో కోయిలల్లు,పాటల్లు
నేలల్ల జీవుల్ల తాపాల్నితోలు వానల్లు
వరదల్లుపొదరిళ్ళు హరివిల్లు విరిజల్లు

Monday, 18 May 2020

Poor, migrant, vulnerable

కూలి బతుకులు నాలి బతుకులు
జోలి బతుకులు కాలే బతుకులు
శాపాల బతుకులు వాలిపొయే బతుకులు

రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు
పక్క దొరకని బిక్క బతుకులు
అంతుచిక్కని బక్క బతుకులు

నడిరోడ్డు మీద దిక్కుమొక్కంటూ లేని బతుకులు
రైలుపట్టాలమీద చెట్టపట్టాలుగా చచ్చే  బతుకులు
వాహనలకింద పురుగుల్లా నల్గిపొయే బతుకులు  

బతుకు బరువైనా చావలేక బతికే బతుకులు
రేపుంటామో లేదో తెలియని బతుకులు
రామాకృష్ణాదులు అక్కరకు రాని బతుకులు  

ఎండకు మలమల మండె బతుకులు
ఆకలికి వలవల లాడె బతుకులు
కలకాలం కలకలంతొ బతికే బతుకులు

గవర్నమెంటు మెసేజీలతో పనిలేని బతుకులు
ఏ జీడీపీలు ఏ ప్యాకేజీలు ఆదుకోని బతుకులు
లాకప్పో లాక్డౌనో మరేంటో తెలియని బతుకులు  

నలత బతుకులు కలత బతుకులు  
అతుకుల గతుకుల బతుకులు
రోజువారీ బతుకులు వలస బతుకులు




Saturday, 16 May 2020

Myriad flowers and colors

నవశిశువుల అరికాళ్ళ వేళ్ళలా
బామ్మల పాపిట బొట్టులా
నిండుగర్భిని నగుమోములా
వధూవరుల మొదటి కలయికలా

ముత్తైదువ పట్టంచు చీరలా 
పిల్లలగుంపుల కిలకిల నవ్వుల్లా
శాస్త్రీయసంగీతపు రాగభావంలా
ఆందెల లయవిన్యాస రవళిలా

కన్నెయీడు పరువంలా, ఆశలా
ఇష్టసఖి అనురాగపు పిలుపులా
ఆత్మబంధువు అప్యాయతలా    
పాల నురుగుల్లా, తేనెతరగల్లా

ఈ నేల వర్ణోద్ధృతి అపారం
అమోఘం అపూర్వ నయనానందం
వెల్లివిరిసిన హౄదయోల్లాసం       
ఆధ్యాత్మికం చిదానందం




Tuesday, 12 May 2020

Time and grow

We call it we are growing
We call it we are growing old
We call it we are getting wiser

We grow with them and they grow with us
We call it adolescence when kids are growing
We sense it in the hoarseness of their voices

We see their tantrums transform into firm opinions and persons
We take in our stride when kids start pointing our eccentricities

We start taking pride in their persons and personalities
We call it by many names. We also call it the TIME.

Time, the healer, the revealer, the soother, the leveller.
The beauty lies in its continual flow and happiness lies in
Growing and flowing along with it.