Tuesday, 7 September 2021

with parents

 అమ్మ అమ్మమ్మైనా అమ్మ దగ్గర గారాల పట్టీయే 

అమ్మచెంతన మమతానురాగల లాలన పాలనలో  

మనసు సుతారం తేలిగ్గా, హృదయం హాయిగా

బరువుబాధ్యతల్ అమాంతం మాయమైనట్లుగా  

అమ్మనాన్నల  సంరక్షణ మన చుట్టూ ఉన్నట్లుగా 


ఈ లోకం, సమయం అంతా మనదే అన్నట్లుగా     

కంటినిండ వెలుగుతో ఏదోకొత్త బలం వచ్చినట్లుగా  

మృగ్యమైన స్వేచ్ఛా వనంలో విహరిస్తున్నట్లుగా 

జింక పిల్లల్లా , లేగ దూడలా, సెలయేటి అలలా 

కమ్మని కలలా కిలకిలలా సలిల తరగల నురగలా  

 



Sunday, 25 July 2021

Malli

 వో మల్లి మరపించు పాలవెల్లి

సుమధుర సువాసనల మల్లి

యదనిండ సౌరభం వెదజల్లి

మనసాంతరాల్లో ఎక్కడో గిల్లి

వో అల్లిబిల్లి సిరిమల్లి జాబిల్లి

Thursday, 22 July 2021

Garden - offbeat

Grow for their sprouts and shoots

Grow them for their serrated leaves

Grow them for the grainy tiny stems

Grow them for their gripping tendrils

Grow them for their creep and crawl

Just grow them for their lovely green

 

Tuesday, 29 June 2021

aakumadi


 ఏపుగ వరి నారు

పిల్లగాలి తెగ హుషారు

లోలోపల సంబరం పొలమారు

ఇది తొలకరి తరుణ జోరుపైరు

భూముల పచ్చదనాలు అలరారు

palakarimpu

 ఒక పలకరింపు మువ్వల సవ్వడి

ఒక పలకరింపు చినుకుల జల్లు

ఒక పలకరింపు ఒక ఆత్మీయ బంధం

ఒక పలకరింపు గుండెధైర్యం

మనం ఒంటరి కాదనే మనోనిబ్బరం

చల్లని ఎండలా, వెచ్చని చలిలా

మనసు తేలికగ, ప్రాణం హాయిగ

ప్రపంచమే మన వెనకున్నట్లుగా

ఓ పలకరింపు ఓ చిలకరింపు

ఓ పలకరింపు ఓ తొలకరింపు

Friday, 12 June 2020

కళ్ళకు జోడు పెట్టి
కాళ్ళకు మేజోడు కట్టిపెట్టి
సులువుకు కచ్చా కట్టి
సైకిలుకు జిన్నుగడ్డి ఇరగ్గట్టి

సాగిపోయే  అవ్వా

నీ కాయకష్టానికి జోహర్
నీ తెగువకినిబ్బరానికి  జోహార్
నీ స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి జోహార్
నీ తీరుకు నీపోరుకు జోహార్

నీ చేను పచ్చగుండ
నీ కంటిచూపు చక్కగుండ
నీ కడుపు చల్లగుండ
నీ ఆయువు మంచిగుండ

చివరగా చిన్న విషయం అవ్వో!!
 రైలు పట్టలు మీద కాక
వేరే దారి చూసుకో అవ్వోయ్

Spring

తియ్యటి పుల్లటి మామిళ్ళు
అవకాయ మాగాయ పచ్చళ్ళు
పచ్చని ఆకుల్లో రంగుల పూవుల్లు
వెచ్చటి కొమ్మల్లో కోయిలల్లు,పాటల్లు
నేలల్ల జీవుల్ల తాపాల్నితోలు వానల్లు
వరదల్లుపొదరిళ్ళు హరివిల్లు విరిజల్లు