ఉదయపు నడక ఉదయాన్ని ప్రతిరోజూ కొత్తగా పరిచయం చేస్తుంది
నీ మనుగడను మననంచేయిస్తుంది,నీతో నిన్ను కలుపుతుంది
నిన్నటి రేపటి ఆలోచనల వారధిని కట్టి, నీలో సారధిని తట్టి లేపుతుంది
నొసట స్వేదాన్ని చిందిస్తుంది, ప్రకృతితో మమేకం చేస్తుంది
మనిషంటేనే చలనశీలం, మనిషంటేనే ఆలోచన
మనిషంటేనే ప్రాకృతికభాగం, మనిషంటేనే నిరంతర ప్రవాహం
నడక వీటిని పరిచయం చెస్తూనే ఉంటుంది ప్రతిదినం
నడక మనిషిగా ఆత్మవలోకనం చేయిస్తుంది
నడక నిన్ను మనిషిగా చేస్తుంది అనుదినం
No comments:
Post a Comment