Saturday, 24 December 2022

FIFA2022MESSI

 వాడి కాళ్ళు ఏంటి అంత వడివడిగా కదులుతున్నాయ్

వాడు మైదానంలో బంతి వెంట అల అలా పరిగెడుతుంటే

వాడి వంకా వాడి కాళ్ళ వంక చూడ్డం భలే ముచ్చటగాఉంది 

వాడి కాళ్ళల్లొ పాదరసం అయస్కాంతం ఉన్నట్టున్నాయ్

వీడి కాళ్ళు సామదానభేద దండోపాయాలన్నీ వాడుతున్నట్టున్నాయ్     

వీడి కాళ్ళు కోలాటాలు, టక్కుటమారాలన్ని ఆడుతున్నట్టునాయ్

ఏదో మాయామంత్రం వేసినట్టు, ఈ బంతి పెంపుడు కుక్కపిల్లలా

జంట మంత్రదండాల్లాంటి వీడి కాళ్ళ చుట్టూ తచ్చాడుతున్నట్టుంది

కాళ్ళకు ఇంత చురుకుదనం ఇన్ని తెలివితేటలుంటాయా అనిపిస్తుంది

ఆటలో చకచక కదులుతున్న అన్ని రకాల కాళ్ళల్లొ వీడి కాళ్ళకు దండాలు           


No comments:

Post a Comment