Thursday, 21 October 2021

words and words


పదాలు మనోరథాలు, పదాలు సారస్వతవాహినిలు

పదాలు భావప్రకటనలు, పదాలు చరిత్ర పల్లకీలు

  

పదాలు వారసత్వ సంపదలు, పదాలు మానవవికాశోద్దీపనాలు

పదాలు స్వప్నావిష్కృతాలు, పదాలు భగవన్నామ పలుకులు


పదాలు-

లోకం తీరుతెన్నులు, ప్రజల స్థితిగతులు  

జీవన్మరణ పోరాట ఆరాటాలు  ఆపసోపాలు        

వ్యక్తులు, వ్యక్తిత్వాలు, తత్వాలు, సిద్ధాంతాలు  

మనుగడ సూత్రాలు, మోక్షపు మార్గములు

No comments:

Post a Comment