Friday, 21 December 2018

Em pillado Telugu song lyrics


----------------------------------------------------------------------------------------------------------
Telugu Song: Em pillado
Genre: Popular folk song
Writer: Vangapandu
----------------------------------------------------------------------------------------------------------
భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా

సికాకులంలో సీమకొండకి <ఏం పిల్లడో...>
అరె చిలకలు... అరె చిలకలు... ఏయ్ చిలకలు  కత్తులు దులపరిస్తయట <ఏం పిల్లడో....>
అరె సాలూరవతల సవర్లకొండకి <ఏం పిల్లడో....>
చెవల పిల్లులు భల్ చెవల పిల్లులు... శంఖమూదెనట <ఏం పిల్లడో....>
అరెరెరెరె నల్లగొండ... అరె నల్లగొండ... భలె నల్లగొండ... భల్ నల్లగొండ... నల్లగొండ నట్టడివిలోనికి <ఏం పిల్లడో....>
పాముని... అరె పాముని... భలె పాముని పొడిచిన చీమలున్నవట <ఏం పిల్లడో....>
తెలంగాణ... భలె తెలంగాణ... భలె తెలంగాణ...భలె......
తెలంగాణ...భలె తెలంగాణ... తెలంగాణ...
అరె తెలంగాణ కొమరయ్య కొండకి <ఏం పిల్లడో....>

అరె గెద్దని...అరె గెద్దని...అరె గెద్దని తన్నిన గేద్దూలున్నవట <ఏం పిల్లడో....>
ఆకులు మేసిన మేకలకొండకు <ఏం పిల్లడో....>
రాయలసీమ...రాయలసీమ...రాయలసీమ రాలుగొండకి  <ఏం పిల్లడో....>
రక్తం...అరె రక్తం...అరె రక్తం రాజ్యం ఏలుతున్నదట <ఏం పిల్లడో....>
తూరుపు దిక్కున తూరకొండకి <ఏం పిల్లడో....>
అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి... తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....>
అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి... తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....>
కలకత్తా కొస కారుకొండకి <ఏం పిల్లడో....>
ఎలుకలు... అరె ఎలుకలు...అరె ఎలుకలు పిల్లిని ఏటా తగెలెనట <ఏం పిల్లడో....>

ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...
భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...

-------------------------------------------------------------------------------------------------------------
Transliteration verson
-----------------------------------------------------------------------------------------------------------
bhale bhale bhale bhale
Em pillaDO...Em pillO...
Em pillaDO eldumostavaa Em pillO eldumostavaa
Em pillaDO eldumostavaa Em pillO eldumostavaa

sikaakulaMlO seemakonDaki <Em pillaDO...>
are chilakalu... are chilakalu... Ey chilakalu  kattulu dulaparistayaTa <Em pillaDO....>
are saalooravatala savarlakonDaki <Em pillaDO....>
chevala pillulu bhal chevala pillulu... SaMkhamoodenaTa <Em pillaDO....>
arererere nallagonDa... are nallagonDa... bhale nallagonDa... bhal nallagonDa... nallagonDa naTTaDivilOniki <Em pillaDO....>
paamuni... are paamuni... bhale paamuni poDichina cheemalunnavaTa <Em pillaDO....>
telaMgaaNa... bhale telaMgaaNa... bhale telaMgaaNa...bhale......
telaMgaaNa...bhale telaMgaaNa... telaMgaaNa...
are telaMgaaNa komarayya konDaki <Em pillaDO....>

are geddani...are geddani...are geddani tannina gEddUlunnavaTa <Em pillaDO....>
aakulu mEsina mEkalakonDaku <Em pillaDO....>
raayalaseema...raayalaseema...raayalaseema raalugonDaki  <Em pillaDO....>
raktam...are raktam...are raktam raajyam ElutunnadaTa <Em pillaDO....>
toorupu dikkuna toorakonDaki <Em pillaDO....>
are tupaaki...bhale tupaaki... are tupaaki... tupaaki pElchina tooneegalunnavaTa <Em pillaDO....>
are tupaaki...bhale tupaaki... are tupaaki... tupaaki pElchina tooneegalunnavaTa <Em pillaDO....>
kalakattaa kosa kaarukonDaki <Em pillaDO....>
elukalu... are elukalu...are elukalu pillini ETaa tagelenaTa <Em pillaDO....>

Em pillaDO...Em pillO...
Em pillaDO...Em pillO...
bhale bhale bhale bhale
Em pillaDO...Em pillO...
Em pillaDO...Em pillO...  

Friday, 5 October 2018

GG water

ఇవి మంజీర నాదాలో
కృష్ట్నమ్మ సిరి పరవళ్ళో
గోదావరీ బంగారు గలగలలో
గాయత్రి వనమున
సరిగంగ పారించిన
భాగీరథులందరికి
వేనోళ్ళ ప్రణామములు 

Thursday, 13 September 2018

what is poetry

Often times, I tease my kids and neighborhood kids to write some poetry.
They innocently ask, what is poetry? So, I wanted to write a poem about
poetry itself.

Tried to make it as simple and easily understandable. No violence of verbosity
and tyranny of dense thoughts, or ethereal lunacy. Hence, without much fuss, here 
are  few lines about simple prose/poetry to inspire children to be aware of , read
and write some poetry/verse.
/----------------------------------------------------
What is poetry?
/--------------------------------------------------------
It is about rising and falling sun, its rays and its shining
It is about hiding and seeking moon, grey shapes on it
It is about tiny twinkling stars up there and so many of them
It is about bluish vast sky, its nearness, farness and its colors

It is about ever repeating cycle of seasons and bounties they bring along
It is about flapping and flitting butterflies and bright clothes they wear
It is about spitter-spatter of rain and its silver lines and bubbles it creates
It is about flying birds of all sizes, their many colours and soft feathers

It is about plants and trees and their baby life, their play with wind
Their canopy, boring bark, their shiny leaves, fruits, roots and seeds.
It is about lovely blooming buds and flowers and their bright paints
About buzzing bees around them, the flowery smells and their short life

It is about misty mornings, bright evenings  and beautiful nights
It is about mommy’s love for us, grandparents grand pampering
It is about all the strange cooking sounds and smells from kitchen
It could be about many gods around us and their unbelievable stories
It could also be about us, our thoughts and feelings just about anything.

Sunday, 9 September 2018

ఆటల్ బిహరి వాజపేయీ (1924-2018)


ఎప్పుడూ చూడలేదు ప్రత్యక్షంగా - కాని అమితమైన ప్రేమ గౌరవం
నీ పలుకు మధురం నీ మాట ఉదారం నీ వదనం మూర్తిత్వము
భాష తెలియనివాళ్ళకు కూడా నీ మాటలో మృదుత్వం, ఆర్తి విదితమే
ఎదురులేని రాజువి, కాని కత్తులు దూషనలు, ఎత్తులు పైఎత్తులు లేకుండ
సాధించినవే, రాజులకే రాజధర్మం నేర్పించిన అగ్రగణ్యుడివి   

ప్రజాస్వామ్య లౌకిక అంతకన్నా మానవీయ విలువలను రక్షించినవాడవు 
సాహిత్య శిఖరానివి, మానవతా సాగరానివి, కవుల్లొ నేతవీ, నేతల్లో కవివీ 
మృధుస్వభావివీ కర్మ యోగివీ  ద్వేషరహితమైన వాడవు
శాంతి సామరస్యం మీద అపూర్వ విశ్వాసం ఉంచినవాడివి
ఉత్తరాన జన్మించావు, భారతదేశానికే నైసర్గికమయ్యావు  

అధికారం కోసం గడ్డి తినకూడదని ఆచరించి చూపిన ధీశాలివి
భారతీయతను, సాంప్రదాయాన్ని  నలుమూలలా చాటిన రాజనీతిజ్ఞుడివి 
ఛాందసవాసాన్ని, మతతత్వ  శక్తుల్ని  ఎదిరించిన వాడివి
ఉదారత విశాల హృదయంతో   వ్యక్తిగతజీవనాన్ని, జనజీవనాన్ని    
సాగించి నాయకులకు, ప్రజలకు, ప్రపంచానికే  ఆదర్శడువయ్యావు 

ఇవన్నీ ఒకెత్తయితే కొత్తఢిల్లిలో ఉంటూ మారుమూల పాతగ్రామాల 
ఇరుకు సందుల్లో రోడ్ల గురించి ఆలోచించి  సడక్ యోజన
అమలు పరచి  పల్లెటూర్ల ముఖచిత్రాన్నే మార్చేసిన దార్శనికుడవు
దీనికి ఒక చిన్న తార్కాణం  - మావూరి హరిజనపేటలొ నేను

చిన్నప్పటి చూస్తున్న జిగురుమట్టి వీధిలో మొలిచిన  సిమెంటురోడ్డు    

Monday, 3 September 2018

Pooja Mandiram (Personal prayer place)

చిక్కటి దివ్యవర్ణ కుంకుమ
లేలేత బంగరు వన్నె పసుపు
అపుడే తీసిన మంచిగంధపు వాసన
కనక పుష్యరాగ సారుప్య అక్షితలు

తడిఆరని విరికుసుమాల సమూహం
చిన్నచిన్న చందమామ ముక్కల్లాంటి కర్పూరం
తళతళ మెరియు వెండీరాగి పూజా సముదాయం 
వెలిగించిన అగరొత్తుల  పరిమళ ధూపాలు

విద్యావినయ ప్రదాయి సరస్వతి ఛాయచిత్రం
ఆయురారోగ్య ఐశ్వర్య సువర్షిని శ్రీలక్ష్మీ విగ్రహం          
అభయాంజనేయుడుజటాజూట నటరాజు
అనేక ఇష్టవేల్పుల చిత్రపటాల సమాహారం          

తమలోని లోతుల్నితత్వాన్ని గ్రహించమనే
వ్రతప్రార్థనా ప్రతులుసంప్రదాయపు పుస్తకాలు
ఇటు చూడమంటున్న సనాతన ధర్మగ్రంథాలు
ధర్మసూక్ష్మాల్ని తెలిపే రామాయణ భగవద్గీతలు  

పూజా మందిరం యద లోతుల్ని ప్రేరేపించి
అంతరంతరాళాల్లొ మనోనిర్మలత్వాన్ని   
హృదయప్రశాంతతను చేకూర్చే శ్రేష్టమైన
దివ్య పరిమళాలను వెదజల్లే మోక్షప్రదేశం       

 చిన్న ప్రార్థనా స్థలమందే ఒక సాధారణ మనిషి తన
జీవంలొనే ఉన్న పరమాత్మను నమ్మి వెదికే ప్రయత్నం
నేనెవరను  మూలప్రశ్నను తనకు తానే సంధించుకొని
తన పరిధిలోనే ఆధ్యాత్మికతతో కూడిన తత్వశోధనం