ఎప్పుడూ
చూడలేదు ప్రత్యక్షంగా - కాని అమితమైన ప్రేమ
గౌరవం
నీ పలుకు మధురం నీ
మాట ఉదారం నీ వదనం
మూర్తిత్వము
భాష తెలియనివాళ్ళకు కూడా నీ మాటలో
మృదుత్వం, ఆర్తి విదితమే
ఎదురులేని
రాజువి, కాని కత్తులు దూషనలు,
ఎత్తులు పైఎత్తులు లేకుండ
సాధించినవే,
రాజులకే రాజధర్మం నేర్పించిన అగ్రగణ్యుడివి
ప్రజాస్వామ్య
లౌకిక అంతకన్నా మానవీయ విలువలను రక్షించినవాడవు
సాహిత్య
శిఖరానివి, మానవతా సాగరానివి, కవుల్లొ
నేతవీ, నేతల్లో కవివీ
మృధుస్వభావివీ
కర్మ యోగివీ ద్వేషరహితమైన
వాడవు
శాంతి సామరస్యం మీద అపూర్వ విశ్వాసం
ఉంచినవాడివి
ఉత్తరాన
జన్మించావు, భారతదేశానికే నైసర్గికమయ్యావు
అధికారం
కోసం గడ్డి తినకూడదని ఆచరించి
చూపిన ధీశాలివి
భారతీయతను,
సాంప్రదాయాన్ని నలుమూలలా
చాటిన రాజనీతిజ్ఞుడివి
ఛాందసవాసాన్ని,
మతతత్వ శక్తుల్ని ఎదిరించిన
వాడివి
ఉదారత విశాల హృదయంతో వ్యక్తిగతజీవనాన్ని, జనజీవనాన్ని
సాగించి
నాయకులకు, ప్రజలకు, ప్రపంచానికే ఆదర్శడువయ్యావు
ఇవన్నీ
ఒకెత్తయితే కొత్తఢిల్లిలో ఉంటూ మారుమూల పాతగ్రామాల
ఇరుకు సందుల్లో రోడ్ల గురించి ఆలోచించి సడక్
యోజన
అమలు పరచి పల్లెటూర్ల
ముఖచిత్రాన్నే మార్చేసిన దార్శనికుడవు
దీనికి
ఒక చిన్న తార్కాణం - మావూరి హరిజనపేటలొ నేను
చిన్నప్పటి
చూస్తున్న జిగురుమట్టి వీధిలో మొలిచిన సిమెంటురోడ్డు
No comments:
Post a Comment