చిక్కటి దివ్యవర్ణ కుంకుమ
లేలేత బంగరు వన్నె పసుపు
అపుడే తీసిన మంచిగంధపు వాసన
కనక పుష్యరాగ సారుప్య అక్షితలు
తడిఆరని విరికుసుమాల సమూహం
చిన్నచిన్న చందమామ ముక్కల్లాంటి కర్పూరం
తళతళ మెరియు వెండీరాగి పూజా సముదాయం
వెలిగించిన అగరొత్తుల పరిమళ ధూపాలు
విద్యావినయ ప్రదాయి సరస్వతి ఛాయచిత్రం
ఆయురారోగ్య ఐశ్వర్య సువర్షిని శ్రీలక్ష్మీ విగ్రహం
అభయాంజనేయుడు, జటాజూట నటరాజు
అనేక ఇష్టవేల్పుల చిత్రపటాల సమాహారం
తమలోని లోతుల్ని, తత్వాన్ని గ్రహించమనే
వ్రతప్రార్థనా ప్రతులు, సంప్రదాయపు పుస్తకాలు
ఇటు చూడమంటున్న సనాతన ధర్మగ్రంథాలు
ధర్మసూక్ష్మాల్ని తెలిపే రామాయణ భగవద్గీతలు
పూజా మందిరం యద లోతుల్ని ప్రేరేపించి
అంతరంతరాళాల్లొ మనోనిర్మలత్వాన్ని
హృదయప్రశాంతతను చేకూర్చే శ్రేష్టమైన
దివ్య పరిమళాలను వెదజల్లే మోక్షప్రదేశం
ఈ చిన్న ప్రార్థనా స్థలమందే ఒక సాధారణ మనిషి తన
జీవంలొనే ఉన్న పరమాత్మను నమ్మి వెదికే ప్రయత్నం
నేనెవరను మూలప్రశ్నను తనకు తానే సంధించుకొని
తన పరిధిలోనే ఆధ్యాత్మికతతో కూడిన తత్వశోధనం
No comments:
Post a Comment